మడకశిర: డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువతకు ఎస్పీ సతీష్‌కుమార్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, హెల్మెట్ వినియోగంపై ప్రజలను చైతన్య పరుస్తూ సోమవారం మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో బహిరంగ అవగాహన సభ జరిగింది. కార్యక్రమానికి ఎస్పీతో పాటు సినీనటులు శ్రీవిష్ణు, రఘు, అనన్య, హెబ్బాపటేల్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వెంకట్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బోర్డు సభ్యుడు శ్రీనివాసమూర్తి, అంధ మహిళల టీ20 క్రికెట్ ఇండియా టీం కెప్టెన్ దీపిక ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగంపై ప్రజలను చైతన్య పరుస్తూ తొలుత పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ సర్కిల్‌లో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధ్యక్షత జరిగిన అవగాహన సభలో ఎస్పీ మాట్లాడారు. డ్రగ్స్‌కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ కేసుల్లో ఒక్కసారి చిక్కుకుంటే ఇతర దేశాలకు వెళ్లడానికి కూడా అనుమతులు దక్కవన్నారు. అలాగే హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరించారు. కార్యక్రమంలో కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ నరసింహరాజు, డీఎస్పీ నర్శింగప్ప, సీఐలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్సీ సతీష్‌కుమార్


