నేడు ముసలమ్మ ఆలయంలో కుంభాభిషేకం | - | Sakshi
Sakshi News home page

నేడు ముసలమ్మ ఆలయంలో కుంభాభిషేకం

Mar 17 2026 7:49 AM | Updated on Mar 17 2026 7:49 AM

బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని తాడిపత్రి రహదారి పక్కన చెరువు కట్ట సమీపంలో నూతనంగా నిర్మించిన ముసలమ్మ దేవాలయంలో సోమవారం 6వ వార్షికోత్సవ కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. ముసలమ్మ వంశస్తులైన సుశీల సూర్యనారాయణరెడ్డి సొంత నిధులతో పాటు గ్రామస్తుల ఆర్థిక సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టారు. 17న ఆలయంలో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు మూల దేవతా ప్రార్థన, గురు ప్రార్థన, గణపతి పూజ, స్వస్తి వాచనము, రక్షా బంధనము నిర్వహించనున్నారు. 18న ఉదయం 6 గంటకు అమ్మవారికి అభిషేకం, కళశ స్థాపన గణపతి హోమం, పంచామృతాభిషేకం, కలశ స్థాపన ఆదిత్యా నవగ్రహ హోమం, ముసలమ్మ అమ్మవారి మూల మంత్ర హోమం, ఉదయం 10 గంటలకు మహా పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 గంటలకు మహా మంగళ హారతి నిర్వహించన్నారు. 19న సాయంత్రం 5 గంటలకు చిక్క వడియార్‌ చెరువులో ముసలమ్మ తల్లి అమ్మవారి తెప్పోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త సుశీలమ్మ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement