రొద్దం: మండల కేంద్రంలోని శ్రీటీచ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని లహరి స్పెల్‌బి కాంపిటీషన్‌లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల కరస్పాండెంట్ ఆర్‌కే తిమ్మారెడ్డి తెలిపారు. అనంతపురం పట్టణంలో విశ్వ ఎడ్యుటెక్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో తమ పాఠశాలకు చెందిన లియా, హుస్సేన్, సంజయ్, లహరి పాల్గొన్నారన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎం లహరి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు వివరించారు. ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ హేమచంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయికి ఎంపికై విద్యార్థిని లహరిని పాఠశాల ఉపాధ్యాయు బృందం అభినందించింది.
జాతీయస్థాయికి ఎంపిక


