కదిరి సబ్ జైలు సమీపంలోని విజయలక్ష్మి గ్యాస్ ఏజెన్సీ వద్ద శనివారం కనిపించిన దృశ్యమిది. అమెరికా, ఇజ్రాయొల్– ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లు సరిగా సరఫరా కావడం లేదు. సిలిండర్ బుక్ చేసి వారం దాటినా డెలివరీ కాకపోవడంతో కదిరి పట్టణంతో పాటు రూరల్ మండలంలోని పలు గ్రామాల వినియోగదారులు ఇలా సిలిండర్లు తీసుకుని ఏజెన్సీ వద్దకు వచ్చారు. దాదాపు 500 మంది రాగా, శనివారం సగం మందికి కూడా సిలిండర్లు ఇవ్వలేకపోయారు. అధికారులు మాత్రం గ్యాస్ కొరత లేదని, బుక్ చేసుకుంటే నిర్ణీత వ్యవధిలో ఇంటికే వస్తోందంటూ ప్రకటిస్తుండటం గమనార్హం. – కదిరి టౌన్:


