చిలమత్తూరు: స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరిన ఇద్దరు యువకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మృతులిద్దరూ బావబావమరిది కావడంతో ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. చిలమత్తూరు ఎస్‌ఐ మునీర్ అహ్మద్ తెలిపిన వివరాల మేరకు... బీదర్‌కు చెందిన అభిషేక్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. ఇటీవలే అభిషేక్‌కు బీదర్‌కు చెందిన యువతితో వివాహమైంది. కుటుంబమంతా సంతోషంగా ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి అభిషేక్ తన భార్య సోదరుడు సుమిత్‌తో కలిసి సొంతూరు బీదర్‌కు బైక్‌పై బయల్దేరాడు. శనివారం తెల్లవారుజామున కొడికొండ చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్నారు. బైక్‌పై వేగంగా వస్తున్న వీరు చెక్ పాయింట్ వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను గుర్తించలేక అలాగే ముందుకు నడిపారు. బైక్ స్పీడ్ బ్రేకర్‌ను దాటి అదే వేగానికి ముందు వెళుతున్న ఐచర్ వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న అభిషేక్, ఆయన బావమరిది సుమిత్ ఇద్దరూ కిందపడ్డారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపటినట్టు ఎస్‌ఐ తెలిపారు.
మృతులిద్దరూ బావబావమరుదులు
స్వగ్రామానికి బయలుదేరి తిరిగిరాని లోకాలకు..


