ఆందోళన వద్దు.. అందరికీ ఇస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆందోళన వద్దు.. అందరికీ ఇస్తాం

Mar 15 2026 1:01 AM | Updated on Mar 15 2026 1:01 AM

న్యూస్‌రీల్‌

12 వేల సిలిండర్లు అందుబాలో ఉన్నాయి

ప్రశాంతి నిలయం/రొద్దం: గ్యాస్‌ సరఫరాపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, బుక్‌ చేసుకున్న ప్రతివారికీ సిలిండర్‌ అందేలా చూస్తామని జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రోజూ జిల్లా వినియోగదారులకు సరిపడా గ్యాస్‌ సిలెండర్లు ఆయిల్‌ కంపెనీల ద్వారా అందుతున్నాయన్నారు. శనివారం నాటికి జిల్లాలో 12 వేల గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక సిలిండర్‌ను పొందిన గ్రామీణ ప్రాంత వాసులు 45 రోజుల తర్వాత, పట్టణ ప్రాంత వాసులు 25 రోజుల తర్వాత గ్యాస్‌ బుకింగ్‌ చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న వారికి మాత్రమే సరఫరా చేస్తారన్నారు. అవసరం మేరకే గ్యాస్‌ బుక్‌ చేసుకోవాలన్నారు. గ్యాస్‌ ఏజెన్సీల వద్దకు గానీ, గోదాముల వద్దకు గాని వెళ్లకూడదన్నారు. అంతకుముందు ఆయన రొద్దంలోని విజయలక్ష్మి గ్యాస్‌ ఏజెన్సీలో తనిఖీలు చేశారు. గ్యాస్‌ సిలిండర్లు నిల్వ చేసిన గోడౌన్‌ను తనిఖీ చేసి అక్కడే ఉన్న వినియోగదారులతో మాట్లాడారు. అదేవిధంగా గ్యాస్‌ సిలిండర్లు డెలివరీ చేసే వాహనాన్ని తురకలాపట్నం గ్రామంలో తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement