అనంతపురం: జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. రాజీకి అనుగుణంగా ఉన్న 10,082 కేసులు పరిష్కరించినట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. అనంతపురం కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో ఆయన పాల్గొన్నారు. లోక్ అదాలత్ తీర్పుపై అప్పీలు చేసే అధికారం ఉండదన్నారు. రెగ్యులర్ కోర్టులలో కేసు పరిష్కారమైతే ఎవరో ఒకరే విజేతగా నిలుస్తారన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ అయితే ఇరుపక్షాలూ విజేతలే అని పేర్కొన్నారు. జాతీయ లోక్‌అదాలత్ కేసుల్లో మొత్తం రూ.9.77 కోట్ల పరిహారం దక్కిందన్నారు.


