జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణానికి స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

Feb 23 2026 6:52 AM | Updated on Feb 23 2026 6:52 AM

జిల్ల

జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

పుట్టపర్తి అర్బన్‌: జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ భవన నిర్మాణాలకు అవసరమైన స్థలాన్ని సత్వరమే కేటాయించి నివేదిక పంపాలని పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణను జిల్లా జడ్జి భీమారావు ఆదేశించారు. ఆదివారం ఆయన ఆర్డీఓ సువర్ణ, పుట్టపర్తి జూనియర్‌ సివిల్‌ జడ్జి ముజీబ్‌ పసపల సయ్యద్‌తో కలిసి పలు చోట్ల స్థల పరిశీలన చేశారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ సమీపంలోని భూములు, బీడుపల్లి ఉన్నత పాఠశాల సమీపంలోని మరో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్జి భీమారావు మాట్లాడుతూ 11 ఎకరాలు అవసరమవుతుందని, ఒకే చోట లభ్యం కాకపోతే రెండు చోట్ల అయినా చూడాలన్నారు. అనంతరం జిల్లా జడ్జి భీమారావును న్యాయవాదులు సత్కరించారు. న్యాయవాదులు అతావూర్‌ రెహమాన్‌, యధుభూషణ, చంద్రశేఖర్‌, కృష్ణప్రసాద్‌, శ్రీనివాస్‌, కిరణ్‌, ప్రభాకర్‌ ఉన్నారు.

జిల్లా కోర్టు కాంప్లెక్స్‌  నిర్మాణానికి స్థల పరిశీలన 1
1/1

జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement