బిల్లుల చెల్లింపులో పక్షపాతమా? | - | Sakshi
Sakshi News home page

బిల్లుల చెల్లింపులో పక్షపాతమా?

Jan 25 2026 7:57 AM | Updated on Jan 25 2026 7:57 AM

బిల్లుల చెల్లింపులో పక్షపాతమా?

బిల్లుల చెల్లింపులో పక్షపాతమా?

పరిగి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు చెల్లించ డంలో పక్షపాతం ఎందుకు చూపుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌ మండిపడ్డారు. శనివారం ఆమె పరిగి మండలంలో పర్యటించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి ఎంపీడీఓ రెడ్డెప్పతో మాట్లాడారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేసి న్యాయం చేయాలని కోరారు. డిప్యూటీ ఎంపీడీఓ వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీడీఓతో చర్చించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. మండలంలోని పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులను వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులుగా పరిగణించి వారికి రావాల్సిన బిల్లులను ఆపారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైనేజీలు, అంగన్‌వాడీ భవన నిర్మాణాలు పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టడమే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు చేసిన నేరమా అని వాపోయారు. మంగళసూత్రాలు తాకట్టు పెట్టినా కరుణించరా, ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా అంటూ మంత్రి సవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా అధికారులు వ్యవహరించాలని, అధికారం శాశ్వతంగా ఉండదని గుర్తు చేశారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నా మంత్రికి కొంచైమెనా సిగ్గనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. వారంలోపు బిల్లుల చెల్లించికపోతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తల కోసం కార్యాలయ ఆవరణంలో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికీ వెనకాడబోనన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కోసం ఎందాకై నా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

రోడ్డు సమస్యను పరిష్కరించండి..

జంగాలపల్లిలో రైతులు వ్యవసాయ పొలానికి వెళ్లేందుకు రోడ్డు లేదని, వెంటనే రైతుల సమస్యను పరిష్కరించాలని తహసీల్దారు హసీనాసుల్తానాను ఉషశ్రీచరణ్‌ కోరారు. కొందరి స్వార్థ ప్రయోజనాల వల్లే రోడ్డు సమస్య ఏర్పడిందని తెలిపారు. తహసీల్దారు స్పందిస్తూ ఇప్పటికే ఇరువర్గాలతో మాట్లాడామని, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ నరసింహమూర్తి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అధికారం శాశ్వతం కాదని

మంత్రి సవిత గమనించాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు

ఉషశ్రీచరణ్‌ ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement