జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి.చలి వాతావరణం క
పరిసరాల పరిశుభ్రత
అందరి బాధ్యత
● కలెక్టర్ శ్యాంప్రసాద్
పుట్టపర్తి: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. సర్పంచ్ నాగలక్ష్మి అధ్యక్షతన శనివారం బుక్కపట్నం పంచాయతీ ఆవరణలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను స్వచ్ఛతకు మారుపేరుగా తీర్చిదిద్దుదామన్నారు. అనంతరం వ్యకిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై సిబ్బంది, విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
పాఠశాల విద్యార్థినులతో కలివిడిగా..
జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ శ్యాంప్రసాద్ స్థానిక బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులతో కలివిడిగా మాట్లాడారు. చదువులు ఎలా సాగుతున్నాయి.. వసతులు ఎలా ఉన్నాయి అంటూ ఆరా తీశారు. బాలికల ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, ఐసీడీఎస్ పీడీ ప్రమీళ, తహసీల్దార్ నరసింహులు, ఎంపీడీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
‘ఎట్ హోం’కు ఆహ్వానం
పుట్టపర్తి టౌన్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా విజయవాడలోని లోక్‌భవన్‌లో ప్రముఖులకు గవర్నర్ తేనేటి విందు (ఎట్ హోం) ఇవ్వడం ఆనవాయితీ. ఈ ఏడాది ఎట్ హోంకు పుట్టపర్తికి చెందిన రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్‌కు ఆహ్వానం లభించింది. దీనిపై సురేష్ హర్షం వ్యక్తం చేశారు.
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి.చలి వాతావరణం క


