పిల్లలూ.. మోదీతో మాట్లాడతారా?
కదిరి: పరీక్షల ఒత్తిడిని జయించడం, పరీక్షలను ఒక పండుగలా భావించడం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా జీవితంలో ముందుకు సాగడంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఇందులో పాల్గొనే వారు పరీక్షలపై తమ అభిప్రాయాలు, సందేహాలు, భయాలు, అనుభవాలు, తదితర అంశాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. పరీక్షలకు ఎలా సన్నద్దమవ్వాలి.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? వాటిని ఎలా అధిగమించాలి? విద్యార్థుల ఆకాంక్ష ఏంటి? లక్ష్య సాధనలో అనుసరించాల్సిన మార్గాలు, పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఎలా ఉండాలి.. తదితర అంశాలపై ప్రధాని మోదీ సలహాలు, సూచనలు ఇస్తారు.
ప్రశ్నలు 500 అక్షరాల్లోపే..
‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో 6 నుంచి ఇంటర్ రెండో సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, పాఠాలు బోధించే టీచర్లు/అధ్యాపకులు అర్హులు. ఆసక్తి ఉన్న వారు 2026 జనవరి 11లోపు https:// innovateindia1mygov in/ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పంపించే ప్రశ్న 500 అక్షరాలకు మించి ఉండకూడదు. పాల్గొన్న వారందరికీ ప్రశంసాపత్రాలు అందజేస్తారు. విజేతలకు 2026 జనవరి 26న ప్రధాని నరేంద్ర మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం వస్తుంది. వీరికి ప్రశంసా పత్రాలతో పాటు ‘ఎగ్జామ్ వారియర్స్’ కిట్లు బహుమతిగా ఇస్తారు.
2026 జనవరి 26న ‘పరీక్షా పే చర్చ’
జనవరి 11 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం
6 నుంచి ఇంటర్ వరకు అర్హులు
విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లూ అర్హులే


