జెడ్పీలో సీనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులు
అనంతపురం టవర్‌క్లాక్: జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలన అధికారులుగా పదోన్నతి కల్పించారు. మంగళవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని తన చాంబర్‌లో పదోన్నతుల ఉత్తర్వులను చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో టి.ఫణిశేఖరరెడ్డి (జెడ్పీ కార్యాలయం), సి.రవి (వజ్రకరూరు), వై.లోక మల్లికార్జునరెడ్డి (అమడగూరు), కె.హనుమంతప్ప (గుమ్మఘట్ట), ఎం.కృష్ణానాయక్ (బెళుగుప్ప), హెచ్.మల్లికార్జున (బత్తలపల్లి), యు.ముత్యాలరెడ్డి (జెడ్పీకార్యాలయం) ఉన్నారు. కార్యక్రమంలో సీఈఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
పదోన్నతుల్లో పదనిసలు
జిల్లా పరిషత్ ఉద్యోగుల పదోన్నతుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండు రకాల క్యాడర్లకు మంగళవారం సాయంత్రం పదోన్నతులు ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడి వరకూ ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే పదోన్నతి పొందిన వారికి నిబంధనల మేరకు కచ్చితంగా స్థాన చలనం కలిగించాలి. అయితే ఇందుకు విరుద్ధంగా పోస్టింగ్ ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. ఈ విషయంగా పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లుగా జెడ్పీ ఉద్యోగులు బాహటంగానే విమర్శిస్తున్నారు.


