
జగన్‌తోనే అణగారిన వర్గాలకు ప్రాధాన్యం
చిలమత్తూరు: వైఎస్ జగన్‌తోనే అణగారిన వర్గాలకు అధికారం సాధ్యమని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు అన్నారు. శుక్రవారం హిందూపురంలోని సాయిరాం ఫంక్షన్ హాలులో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సుధాకర్ బాబు మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీలు, ఎస్టీలకు మంత్రి పదవులిచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నారన్నారు. అలాగే పంచాయతీ సర్పంచ్ నుంచి జెడ్పీ చైర్మన్ వరకూ పదవులిచ్చి అధికారంలో భాగం చేశారన్నారు. కానీ నేడు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం దళితులను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అణగదొక్కుతోందన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను గ్రామాలను నుంచి వెలి వేశారన్నారు. ఇలాంటి ఘటనలు కేవలం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఎందుకు జరుగుతున్నాయో అందరూ ఆలోచించాలన్నారు. దళిత వ్యతిరేక కూటమి సర్కార్‌ను కూల్చేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుందాం
రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి సర్కార్...ఎస్సీ, ఎస్టీలపై దాడులను ప్రోత్సహిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. అందుకే నేడు రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. చివరకు దళిత సర్పంచ్‌కు కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. పెనుకొండలో మంత్రి సవిత 15 ఫైనాన్స్ నిధులను దళిత సర్పంచ్‌లకు ఇవ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. దళితులకు అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించి అందరినీ సమానంగా చూసే వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేష్‌రెడ్డి మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంలో దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, రెడ్‌బుక్‌లో అణగారిన వర్గాలనే ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నారన్నారు. బుద్ధిహీనుడైన లోకేష్ చేతిలో రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరం కలిసి కట్టుగా టీడీపీకి గట్టి బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మాట్లాడుతూ.. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకున్న ఏకై క పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. మాజీ సీఎం ఎప్పుడూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ఆప్యాయంగా మాట్లాడే వారన్నారు. సమానత్వాన్ని పెంపొందించిన ఏకై క నేత వైఎస్ జగన్ అని అన్నారు. టీడీపీ నేతలు అంబేద్కర్ విగ్రహాన్ని తగులబెట్టడాన్ని చూస్తే దళితులంటే వారికి ఎంత చిన్నచూపో అర్థం చేసుకోవచ్చన్నారు.
దళితుల ఆత్మగౌరవ పతాక జగన్..
మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తన హయాంలో అమరావతిలో ఆకాశమంత ఎత్తులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచమంతా రాష్ట్రం వైపు చూసేలా చేశారన్నారు. దళితులను అధికారంలో భాగం చేసి వారి అభ్యున్నతిపై తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారన్నారు. జగన్ దళితుల ఆత్మగౌరవ పతాకగా నిలిచారన్నారు. అందుకే మనల్ని ప్రేమించే నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరే అని.. ఆయన్ను మళ్లీ సీఎం చేసుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డి, హిందూపురం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సూర్యమోహన్, ఎంపీపీ రత్నమ్మ, నాయకులు చిన్నప్పయ్య, శ్రీరాములు, చందు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్
రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు
హిందూపురంలో వైఎస్సార్ సీపీ
జిల్లా స్థాయి సమావేశం

జగన్‌తోనే అణగారిన వర్గాలకు ప్రాధాన్యం