
● గుర్తుకొస్తున్నాయి..
బత్తలపల్లి: చిన్ననాటి మిత్రులను కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేవు.. అందరి కళ్లలో చెప్పలేని ఆనందం.. కుటుంబ సమస్యలు, ఇతర ఇబ్బందులు, తారతమ్యాలు అన్నీ మరచిపోయారు. ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఆత్మీయంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ చిన్ననాటి అల్లర్లను గుర్తు చేసుకుని మురిసిపోయారు. ఇందుకు బత్తలపల్లిలోని ప్రాథమిక పాఠశాల వేదికై ంది. ఆ పాఠశాలలో 2005 నుంచి 2009 వరకు 1 నుంచి 5వ తగరతి వరకూ కలిసి చదువుకున్న వారు 15 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో సందడి నెలకొంది. ఒకరి కష్టాలను పాలుపంచుకునేలా ప్రణాళికను రూపొందించుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి ఉపాధ్యాయులు బుక్కచెర్ల రామకృష్ణారెడ్డి, స్వరాజ్యలక్ష్మి, బిల్లే నారాయణస్వామి, వీఎల్‌ఎన్ రవి, నాగభూషణ, పుల్లయ్య, సరళ, చంద్రమోహన్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శివశంకర్, గువ్వల రమేష్, నరేంద్ర, శ్యామ్, సతీష్, నారాయణస్వామి, ప్రసన్న, గణేష్, ఉస్మాన్‌బాబా, బాబావలి, సతీష్, ఉస్మాన్, షెక్షావలి, పవన్, గౌతమి, కళ్యాణి, గంగాదేవి, ఆశాబీ, రహమత్ తదితరులు పాల్గొన్నారు.
తనకల్లు: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1998–99 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అమరికలు లేకుండా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తాము చదివిన తరగతి గదులను కలియతిరుగుతూ నాటి అల్లర్లను గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుధ్దులు నేర్పిన నాటి గురువులు రమణారెడ్డి, నరసింహులు, వేమనారాయణ, కరీముల్లా, జెడ్.రవిను ఘనంగా సన్మానించారు. పాఠశాల హెచ్‌ఎం ఖాదర్‌వలికి పూర్వ విద్యార్థి రమేష్‌నాయక్ ల్యాప్‌టాప్, ప్రింటర్ అందజేశారు. అలాగే భవిష్యత్‌లోనూ పాఠశాల అభివృద్ధికి తమవంతు సాయం చేస్తామని పూర్వ విద్యార్థులు సందీప్‌కుమార్, కడపల శ్రీకాంతరెడ్డి, అమాన్, ఎద్దుల మహీంద్రారెడ్డి, వెంకి, శివ, రమేష్‌నాయక్, రాజేష్, ఫయాజ్, షనవాజ్, కృష్ణవేణి, అనురాధ, సుకన్య, సహజ, నిరుపమ, సుజన, లావణ్య, శ్రీకాంత్ పేర్కొన్నారు.

● గుర్తుకొస్తున్నాయి..