న్యూస్‌రీల్
● టిప్పర్, రెండు ట్రాక్టర్లు సీజ్,
కేసు నమోదు
బత్తలపల్లి: మండలంలోని చిత్రావతి నది పరివాహక గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణాపై ఆర్డీఓ మహేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 5వ తేదీన ‘చిత్రావతిపై పచ్చ పడగ’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ఆయన స్పందించారు. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులతో చర్చించారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ధర్మవరం ఆర్డీఓ మహేష్, బత్తలపల్లి రెవెన్యూ సిబ్బంది, బత్తలపల్లి ఎస్‌ఐ సోమశేఖర్, పోలీస్ సిబ్బందితో కలిసి ఇసుక అక్రమ రవాణాపై దాడులు చేశారు. ఇసుక తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఒక టిప్పర్, రెండు ట్రాక్టర్లును స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
నారాయణ పాఠశాలకు షోకాజ్ నోటీస్
హిందూపురం టౌన్: పట్టణంలోని నారాయణ పాఠశాలకు శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి గంగప్ప షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇటీవల నారాయణ పాఠశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా స్కాలర్ షిప్ పేరిట ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించడంతో పాటు ప్రచారం నిమిత్తం పిల్లలను ఇంటికి పంపుతోందని విద్యార్థి సంఘం నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎంఈఓ గంగప్ప నోటీస్ ఇచ్చారు. మూడురోజుల్లోపు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై ఆర్డీఓ కొరడా