
నేటి నుంచి బోధనేతర కార్యక్రమాల బహిష్కరణ
పుట్టపర్తి అర్బన్: విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపులో భాగంగా శనివారం నుంచి జిల్లాలో టీచర్లు బోధనేతర కార్యక్రమాలు బహిష్కరిస్తున్నట్లు ఫ్యాప్టో నాయకులు ప్రకటించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్, డీఈఓ కార్యాలయ ఏడీలు శ్రీనివాసులు, వినయ్‌మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కేవలం ఉపాధ్యాయుల హాజరు, పిల్లల హాజరు, మధ్యాహ్న భోజనం పనులు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, బోధన వంటి పనులు మాత్రమే చేస్తారని తక్కిన బోధనేతర పనుల జోలికి వెళ్లరని స్పష్టం చేశారు. కలెక్టర్‌ను కలసిన వారిలో ఫ్యాప్టో చైర్మన్ గజ్జల హరిప్రసాదెడ్డి, జనరల్ సెక్రెటరీ గౌస్‌లాజం, కార్యవర్గ సభ్యులు చంద్ర, సుధాకర్, హరిప్రసాదరెడ్డి, షమీవుల్లా, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఏపీటీఎఫ్ 1938 ప్రధాన కార్యదర్శి సురేంద్ర, వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, వెంకటేష్ తదితరులు ఉన్నారు.