
వేంకటరమణుడికి సూర్యాభిషేకం
హిందూపురం: పట్టణంలోని పేట వేంకటరమణ స్వామి దేవస్థానంలో సోమవారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కారమైంది. ఉదయం అభిషేకం అనంతరం వేంకటరమణ స్వామి మూలవిరాట్ పాదాలను సూర్యకిరణాలు తాకాయి. ఇలా దిగువ నుంచి మూలవిరాట్ పై వరకూ ప్రసరిస్తూ అభిషేకం చేస్తున్నట్లు కనిపించాయి. ఈ అపూర్వఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం అర్చకులు మూలవిరాట్‌కు పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి నరసింహమూర్తి, దేవస్థానం చైర్మన్ భగిరథ నవీన్ పాల్గొన్నారు.