
సమస్యలు తీర్చండి సారూ
దారి మూసేశారు
పూర్వపు రాశింపల్లిలో మేము నివాసం ఉంటున్నాం. అయితే ,గ్రామంలోని కొందరు మేము గ్రామంలోకి రాకుండా, మా వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు వీలులేకుండా దారి మూసేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకుని మా పొలాలకు దారి చూపండి సార్. లేకపోతే మా జీవనాధారమైన వ్యవసాయం చేసుకోలేం.
– కలెక్టర్ ఎదుట వాపోయిన
రాశింపల్లి గామస్తులు
ప్రశాంతి నిలయం: ‘‘సారూ..నెలల తరబడి తిరుగుతున్నాం...అర్జీలు ఇస్తూనే ఉన్నాం..అయినా సమస్యలు తీరడం లేదు. ఇప్పటికైనా మా సమస్యలు తీర్చండి’’ అంటూ జనం వాపోయారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు జిల్లా నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. తమ సమస్యలపై అర్జీలిచ్చారు. ఈ సందర్భంలోనే పలువురు తమ సమస్యపై పదులసార్లు అర్జీలిచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. వివిధ సమస్యలపై మొత్తంగా 237 అర్జీలు అందగా.. కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ వాటిని స్వీకరించి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు.
అర్జీలు సత్వరం పరిష్కరించాలి
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీల పరిష్కారంలో పారదర్శకత పాటిస్తూ సత్వర న్యాయం జరిగేలా అధికారులు పని చేయాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఆదేశించారు. కార్యక్రమం అనంతరం ఆయన వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఫిర్యాదులను పరిష్కరించే క్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి విచారణ చేపట్టాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. రీ ఓపెనింగ్, బియాండ్ ఎస్‌ఎల్‌ఏ లేకుండా అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అనంతరం ‘ఉత్తమ క్లాప్ మిత్ర’గా అవార్డు సీఎంతో ఈనెల 6న అవార్డు అందుకున్న కదిరి మండలం బురుగపల్లి గ్రామ పంచాయతీ ‘క్లాప్ మిత్ర’ సింగల దొడ్డెప్పను కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ సన్మానించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి అర్డీఓ సువర్ణ, డీపీఓ సమత, గ్రామ సర్పంచ్ భాస్కర్, పంచాయతీ కార్యదర్శి పద్మశ్రీతో పాటు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
‘పరిష్కార వేదిక’కు వెల్లువెత్తిన అర్జీలు
నెలలుగా తిరుగుతున్నా సమస్య
పరిష్కారం కావడం లేదని జనం ఆవేదన

సమస్యలు తీర్చండి సారూ

సమస్యలు తీర్చండి సారూ