
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
హిందూపురం: రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలంటూ కూటమి ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా బుధవారం హిందూపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలం సమీపంలో ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం వరకు సుమారు 3వేల మంది సంతకాలు చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుకుండా పోతాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు శ్యాంసుందర్, శ్రీనివాసులు, మున్నా, రవికుమార్, నాగరాజ్, నౌషాద్, హరికుమార్, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.