
వృద్ధురాలి దుర్మరణం
ధర్మవరం అర్బన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ఓ దుండగుడు చాకచక్యంగా అపహరించాడు. బాధితురాలు తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లితండాకు చెందిన రవినాయక్ భార్య జమున బుధవారం ఉదయం తన కుమార్తెను అనంతపురంలోని కళాశాలలో వదిలి తిరుగు ప్రయాణంలో ధర్మవరానికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. తలనొప్పిగా ఉండడంతో టాబ్లెట్ వేసుకుని బస్సులోనే నిద్రపోయింది.
బస్సు ధర్మవరం బస్టాండ్‌కు చేరుకున్న సమయంలో నిద్ర లేచిన ఆమె తన మెడలో ఉన్న మూడున్నర తులాల బరువునన బంగారు గొలుసు కనిపించకపోవడంతో ఆందోళనకు లోనైంది. బంగారు గొలుసును చోరీ చేశారని నిర్ధారించుకుని విషయాన్ని ఆర్టీసీ డీపో అధికారులకు తెలపడంతో ... వారు వెంటనే ధర్మవరం వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బస్టాండ్‌కు చేరుకుని జమునతో జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. బస్సులో తన పక్కన గుర్తు తెలియని వ్యక్తి కూర్చున్నాడని కళాజ్యోతి సర్కిల్‌లో అతను దిగిపోయాడని పోలీసులకు వివరించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.