
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వెంకట్రామిర
కదిరి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తనకల్లు మండలానికి చెందిన యువ న్యాయవాది జి.వెంకట్రామిరెడ్డిని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రిమాండ్‌కు అంగన్‌వాడీ సిబ్బంది
తనకల్లు: మండలంలోని ముత్యాలవారిపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న కార్యకర్త పుప్పాల రాధమ్మ, ఆయా కత్తి కుళ్లాయమ్మను కదిరి రూరల్ సీఐ నాగేంద్ర ఆదేశాల మేరకు బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు. జూన్ 3న అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఉన్న సంపులో పడి గ్రామానికి చెందిన పుప్పాల సంధ్యారాణి, పుప్పాల గిరీష్‌బాబు దంపతుల కుమారుడు నిశాంత్ బాబు మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడి తల్లి సంధ్యారాణి ఫిర్యాదు మేరకు అప్పట్లో అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంగన్‌వాడీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందినట్లుగా నిర్ధారణ కావడంతో నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.