
సూపర్ సేవింగ్స్‌పై అవగాహన కల్పించాలి
ప్రశాంతి నిలయం: ‘సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్’పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్, గర్ల్ చైల్డ్‌డే, చెత్తసేకరణ, తల్లికి వందనం, పీఎం సూర్యఘర్, వ్యవసాయం, రెవెన్యూ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జీఎస్టీ తగ్గింపు దానివల్ల కలిగే ప్రయోజనాలను వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. అలాగే ఈ నెల 11న నిర్వహించనున్న ‘గర్ల్ చైల్డ్’ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇందుకోసం 10వ తేదీన వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. వసతి గృహాల అధికారులు పారిశుధ్యం, భోజన ఏర్పాట్లు, నీటి వసతి, మరుగుదొడ్లు, వంటగది తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలన్నారు. ఇక నుంచి ప్రతి వారం ‘శానిటేషన్ వీక్’ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ‘తల్లికి వందనం’కు సంబంఽధించి 1,719 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వాటిని సరిదిద్ది పంపాలన్నారు. ‘పీఎం సూర్యఘర్’ పథకం గురించి ప్రజలకు వివరించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రాము నాయక్, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, సీపీఓ విజయ్ కుమార్‌లతో పాటు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
‘పీఎం ధన్ ధాన్య కృషి’ అమలు చేయాలి..
‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో పథకం అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘పీఎం ధన్ ధాన్య యోజన’ పథకం గురించి అర్హులకు వివరించి వారు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు, ఉత్పాదకత వివరాలను నివేదిక రూపంలో అందించాలన్నారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే విధంగా రైతులను చైతన్యవంతులను చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి రాము నాయక్, సీపీఓ విజయ్ కుమార్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి హరికృష్ణ, నీటిపారుదల, మత్స్య శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్