
పింఛన్ సొమ్ముతో సర్వేయర్ ఉడాయింపు
చెన్నేకొత్తపల్లి: లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన పింఛన్ సొమ్ముతో సచివాలయ సర్వేయర్ ఉడాయించిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎంపీడీఓ బాలకృష్ణుడు, ఈఓఆర్డీ అశోక్‌నాయక్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని న్యామద్దెల సచివాలయం–1లో హేమంత్‌కుమార్ గ్రామ సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ కోసం అధికారులు గత నెల 30 తేదీన ఆయనకు కొంత నగదు అందజేశారు. 1వ తేదీ పింఛన్లు పంపిణీ చేసిన హేమంత్‌కుమార్.. ఆరుగురు వృద్ధులకు అందించాల్సిన రూ.24 వేలు, ఓ దివ్యాంగుడికి పంపిణీ చేయాల్సిన రూ.15 వేలు... మొత్తంగా రూ.39 వేలతో అదే రోజు ఉడాయించాడు. ఆరోజు నుంచి హేమంత్‌కుమార్ ఫోన్ కూడా పని చేయలేదు. దీంతో న్యామద్దెల పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌రెడ్డి ఈ విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకురాగా, ఆయన ఉన్నతాధికారులకు తెలిపారు. అయితే తాను స్వాహా చేసిన మొత్తాన్ని బుధవారం సాయంత్రంలోపు తిరిగి చెల్లిస్తానని హేమంత్‌కుమార్ ఇతరుల ద్వారా సమాచారం పంపినా...ఆ మేరకు డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో ఆయనకు నోటీసు జారీ చేసినా... సంజాయి ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.
ఐదురోజులైనా దొరకని ఆచూకీ
చర్యలకు సిద్ధమైన ఉన్నతాధికారులు