మూగజీవాలపై విష ప్రయోగం | - | Sakshi
Sakshi News home page

మూగజీవాలపై విష ప్రయోగం

Sep 27 2025 6:49 AM | Updated on Sep 27 2025 7:02 AM

ఉచిత

ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి

 సోమందేపల్లి: మండలంలోని పోలేపల్లిలో చెందిన పశువులపై దుండగులు విష ప్రయోగం చేశారు. ఎనిమిది గొర్రెలు, ఓ ఆవు మృతి చెందాయి. గ్రామానికి చెందిన కురుబ మారుతి, అంజినమ్మ దంపతులు పాడి, జీవాల పోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గొర్రెలతో పాటు ఓ ఆవును కొనుగోలు చేసేలా గురువారం ఓ వ్యక్తి అడ్వాన్సు చెల్లించి శుక్రవారం తోలుకెళతానని చెప్పి వెళ్లాడు. శుక్రవారం ఉదయం నిద్ర లేచే సరికి పాకలో ఉన్న ఎనిమిది గొర్రెలు, ఓ ఆవు మృతి చెందాయి. విష ప్రభావం కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు. దాదాపు రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరులు వాపోయారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement