
అంగన్‌వాడీల్లో హాజరు పెంచండి
ప్రశాంతి నిలయం: అంగన్‌వాడీల్లో చిన్నారుల హాజరుశాతం పెంచి.. కేంద్రంలో నమోదైన వారంతా అంగన్‌వాడీకి వచ్చేలా చూడాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై సమీక్షించారు. తొలుత ఐసీడీఎస్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ప్రగతిని వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాలు అన్ని కార్యక్రమాల్లో పురోగతి చూపి జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో చేర్చాలన్నారు. సిబ్బంది అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. సీడీపీఓలు
క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకి వచ్చే పిల్లలకు చదువు చెప్పడంతోపాటు సమయానికి పౌష్టికాహారం అందించాలన్నారు. అలాగే కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతి నెలా సకాలంలో పౌష్టికాహారం పంపిణీ జరగాలన్నారు. ప్రతి సెంటర్‌లో పరిస్థితిలను బట్టి ఆకుకూరలు, కూరగాయల మొక్కలు పెంచాలన్నారు. పౌష్టికాహారం అవశ్యకతను తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రతి నెలా శాఖలో చేపట్టే కార్యక్రమాలపై సమీక్షిస్తామన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ప్రమీల, సీడీపీఓలు నాగమల్లేశ్వరి, రాధిక, జయంతి, శాంతాలక్ష్మి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో విస్తృతంగా
‘స్వచ్ఛతా హీ సేవ’..
జిల్లాలో విస్తృతంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు చేస్తున్నామని కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కె.విజయానంద్‌కు వివరించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని, ఇంటింటి చెత్త సేకరణ పకడ్బందీగా చేయడంతో పాటు అవగాహన కూడా కల్పిస్తున్నామని సీఎస్‌కు వివరించారు.
ఐసీడీఎస్ సిబ్బందికి
కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశం