
నేడు, రేపు దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్
పుట్టపర్తి టౌన్: రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన విధానాలతో ఇబ్బంది పడుతున్న దస్తావేజు లేఖరులు శుక్ర , శనివారాల్లో పెన్‌డౌన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గురువారం దస్తావేజు లేఖరులు మాట్లాడుతూ.. ఆధార్ ఓటీపీ, స్థానిక సంస్థల డేటా ఆధారంగా ఇంటి ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంఽధించి రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో విలువైన సమయం వృథా అవుతోందన్నారు. ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ శుక్ర, శనివారం రెండు రోజులపాటు దస్తావేజు లేఖరులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ఇందుకు సంబంధించిన నోటీసును సబ్ రిజిస్ట్రార్ రామ్మోహన్‌కు అందజేశారు.