
యూరియా కోసం రైతుల ఆందోళన
అగళి: యూరియా కోసం మండల పరిధిలోని పి.బ్యాడగేరలో బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం పి.బ్యాడగెర రైతు సేవా కేంద్రానికి 280 బస్తాలు యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు 500 మంది రైతులు ఉదయమే సేవా కేంద్రం ఎదుట బారులు తీరారు. గంటల తరబడి ఓపిగ్గా నిల్చున్నా.. అధికారులు ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. అయినా కూడా చాలా మంది రైతులకు యూరియా అందలేదు. దీంతో వారంతా ఆందోళనకు దిదారు. కనీసం యూరియా కూడా సరఫరా చేయలేని కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.