
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిలలో కూడా కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదుల సమాచారం తెలుసుకోవడానికై నా శ్రీమీ కోసం కాల్ సెంటర్ 1100శ్రీకు ఫోన్ చేయాలని సూచించారు.
పోలీస్ కార్యాలయంలో....
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాలులో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. అర్జీతో పాటు ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు.
తోపుదుర్తి భాస్కరరెడ్డికి కన్నీటి వీడ్కోలు
ఆత్మకూరు: వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కరరెడ్డి (70) అంత్యక్రియలు ఆదివారం అశ్రునయనాల మధ్య జరిగాయి. శుక్రవారం గుండెపోటుతో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. అనంతపురంలోని తోపుదుర్తి భాస్కరరెడ్డి నివాసం నుంచి పెద్ద ఎత్తున అంతిమయాత్ర సాగింది. భాస్కర్‌రెడ్డి అంతిమయాత్ర విషయం తెలుసుకున్న ప్రజలు కక్కపల్లి కాలనీ నుంచి ఆలమూరు రోడ్డు, బి. యాలేరు, మదిగుబ్బ క్రాస్, సనప, రంగంపేట, తోపుదుర్తి గ్రామాల వరకూ ప్రతి గ్రామం నుంచి వందల సంఖ్యలో తరలి వచ్చారు.
అంతిమయాత్రలో పాల్గొన్న ప్రముఖులు
తోపుదుర్తి భాస్కరరెడ్డి అంత్య క్రియల్లో వైఎస్సార్‌సీపీ ఉభయ జిల్లాల అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, ఉష శ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గిరిజమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, తోపుదుర్తి నయనతారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి మార్గంతో పరిపూర్ణత
ప్రశాంతి నిలయం: మనిషిలోని అరిషడ్వర్గాలను వదిలి సత్యసాయి సనాతన ధర్మాలను పాటించడం ద్వారా మనిషి పరిపూర్ణుడు అవుతాడన్న సందేశాన్నిస్తూ సత్యసాయి యూత్, బాలవికాస్ విద్యార్థులు నిర్వహించిన సంగీత నృత్యరూపకం భక్తులను అలరించింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన సంగారెడ్డి భక్తులు ఆదివారం ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత స్వర నీరాజనం అర్పించారు. సాయంత్రం శ్రీమృత్యోర్మా అమృతంగమయశ్రీ పేరుతో నిర్వహించిన సంగీత నృత్యరూపకం ఆకట్టుకుంది. మానవుడు ధర్మ మార్గాన్ని వదిలి అరిషడ్వర్గాలకు లోనై చెడుమార్గాలలో పయనిస్తున్నాడని, సత్యసాయి సనాతన ధర్మాలను పాటించడం ద్వారా పరిపూర్ణుడవుతాడన్న సందేశాన్నిచ్చారు.

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక