
కనకాంబరం.. ధర పతనం
● రవాణా చార్జీలు రావని ఉచితంగా పంపిణీ
బత్తలపల్లి: ‘‘పూలమ్మా పూలు.. కనకాంబరాలు.. ఉచితంగా తీసుకోండి’’ అంటూ మండీ నిర్వాకులు శుక్రవారం బత్తలపల్లి కూడలిలో పూలను పంపిణీ చేశారు. గతంలో బత్తలపల్లి మార్కెట్‌లో రూ.500పైనే పలికిన కేజీ కనకాంబరాలు... శుక్రవారం రూ.50 మాత్రమే పలికాయి. అయితే వాటిని ఎగుమతి చేసేందుకు ప్రయత్నించగా...ఇతర ప్రాంతాల్లో ఆ మాత్రం ధర కూడా లేదు. పైగా ఎగుమతి చేయాలంటే ఆర్టీసీ కొరియర్‌కు అదనంగా రూ.200 చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో రైతుల నుంచి కేజీ రూ.50 చొప్పున కొనుగోలు చేసిన మండీల నిర్వాహకులు... బత్తలపల్లి కూడలిలో ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశారు. మరోవైపు ఆరుగాలం కష్టించి ఎంతో ఆశతో కనకాంబరాలు పండించిన రైతులు కూడా తమకు రవాణా ఖర్చు కూడా రాలేదని వాపోయారు.

కనకాంబరం.. ధర పతనం