
జర్నలిస్టులపై అక్రమ కేసులు దుర్మార్గం
ఒక నాయకుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పత్రికల్లో ప్రచురిస్తే చేస్తే కేసులు పెట్టడం దుర్మార్గం. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కరువైపోయింది. నిజాయతీగా పనిచేసే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు. కూటమి ప్రభుత్వంలో వాక్ స్వాత్రంత్య్రంతో పాటు పత్రికా స్వేచ్ఛ కూడా ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్రం మరో బిహార్‌లా మారిపోయింది. ఏపీలో సామాన్యులకు కూడా భద్రత కరువైంది. – ఉషశ్రీచరణ్, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు