
దిక్కు తోచడం లేదు
నాకున్న ఆరు ఎకరాల్లో పంటల సాగుకు బోరు బావి వేశాను. అరకొరగా నీరు లభ్యం కావడంతో మూడు ఎకరాల్లో టమాట సాగు చేపట్టాను. ఇప్పుడేమో చెరువుల్లో నీరు లేక బోరుబావి ఎండిపోయింది. టమాట సాగుకు చాలా పెట్టుబడి పెట్టాను. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు.
– బయపరెడ్డి, రైతు, మామిళ్లకుంట్లపల్లి
అప్పు ఎలా తీర్చాలి
నాకున్న నాలుగు ఎకరాల్లో పంటల సాగుకని వరుసగా నాలుగు బోర్లు వేశాను. ఒక్క బోరులో కూడా చుక్కనీరు పడలేదు. అన్ని బోర్లు 700 నుంచి 900 అడుగుల వరకూ వేశాను. దాదాపు రూ. 7 లక్షలకు పైగా ఖర్చయింది. గతంలో బెంగళూరుకు వలసవెళ్లి కూడబెట్టిన డబ్బు పోను రూ.4 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. ఈ అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. – చింతా కృష్ణారెడ్డి, రైతు, మారెవాండ్లపల్లి

దిక్కు తోచడం లేదు