
రోజంతా క్యూలో ఉన్నా ఒక్క బస్తానే!
పుట్టపర్తి అర్బన్: రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. అరకొర సరఫరా చేసి కావాల్సినంత నిల్వ ఉందంటూ అధికారులు, కూటమి నేతలు ప్రచారం చేస్తుండగా.. ఈ విషయం తెలియని రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. బుధవారం పుట్టపర్తి మండలం పెడపల్లి రైతు సేవ కేంద్రానికి 260 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు ఉదయం నుంచే ఆర్‌ఎస్‌కే ఎదుట బారులు తీరారు. రోజంతా నిలబడినా ఒక్కో రైతుకు ఒక యూరియా బస్తా మాత్రమే ఇచ్చారు. పైగా ఆధార్, పట్టాదార్ పాసుబుక్, వేలిముద్ర అంటూ హడావుడి చేశారు. దీంతో ఈ మాత్రం దానికి ఇంత కష్టపెట్టాలా అంటూ రైతులు పెదవి విరిచారు.
యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు