
గుడిసె దగ్ధం
ముదిగుబ్బ: మండలంలోని దొరిగిల్లులో బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ప్రమాదంలో లక్ష్మమ్మ గుడిసె దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పేలోపు వంట సరుకులు, గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు బాధితురాలు కన్నీటి పర్యతమైంది.
నాయకుల ముందస్తు అరెస్ట్
● మడకశిర పోలీసుస్టేషన్‌లో ఆనందరంగారెడ్డి, దళిత నేత హనుమంతు అక్రమ నిర్బంధం
మడకశిర: కూటమి సర్కార్ అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్–సూపర్ హిట్’ సభ నేపథ్యంలో బుధవారం మడకశిర పోలీసులు నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి, దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంఆర్ హనుమంతును పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీసుస్టేషన్‌లో ఉంచారు. ఈ సందర్భంగా ఆనందరంగారెడ్డి మాట్లాడుతూ...ముందస్తు అరెస్టులతో ప్రజల తరఫున వినిపించే తమ గొంతను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘సూపర్ సిక్స్’ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే ‘సూపర్ హిట్’ పేరుతో కూటమి ప్రభుత్వం సభను నిర్వహించడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమంతు మాట్లాడుతూ, ముందస్తు అరెస్ట్‌లతో దళిత ఉద్యమాలను ఆపలేరన్నారు. ‘మలుపు’ పథకంతో పాటు లెదర్ పార్కులను ప్రారంభించి చర్మ కారులు, దళిత నిరుద్యోగ యువతను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న తనను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌లో ఉంచడం అన్యాయమన్నారు. ఇది దళితులపై కూటమి ప్రభుత్వం సాధిస్తున్న కక్షగా భావిస్తున్నామన్నారు.

గుడిసె దగ్ధం