
ఎండుతున్న చెరువులు
ఏక కాలంలో ఇద్దరు రైతులు పక్కపక్కనే బోర్లు వేయిస్తున్న దృశ్యం
కనుచూపు మేర వందల ఎకరాల్లో కనిపించని పంటల సాగు
ఓడీచెరువు: వర్షాభావం ఓడీచెరువు మండలాన్ని అతలాకుతలం చేస్తోంది. మండల వ్యాప్తంగా ఉన్న చెరువులు నీరు లేక వట్టిపోయాయి. ఫలితంగా భూగర్బ జలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోయాయి. మండల వ్యాప్తంగా ఉన్న 24 చెరువులు, మరో 24 కుంటల పరిధిలో 1,300 ఎకరాల ఆయకట్టు ఉంది.
రైతుల పరిస్థితి దయనీయం
మండల వ్యాప్తంగా 4,200 వ్యవసాయ విద్యుత్ కనెక్షనుల ఉండగా దాదాపు 9వేల ఎకరాలు బోరుబావుల కింద సాగవుతున్నాయి. భూగర్బ జలాలు అడుగంటి పోవడంతో బోరు బావులు ఎండిపోయాయి. నీరు అందక పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు కొత్తగా బోరుబావులు తవ్వించడం మొదలు పెట్టారు. అదృష్టవశాత్తు నీళ్లు పడితే సరి... లేదంటే మరొకటి, అదీ పడకపోతే మరొకటి ఇలా ఒక్కో రైతు ఏడేనిమిది బోర్లు వేసిన దాఖలాలూ ఉన్నాయి. గతంలో 400 నుంచి 500 అడుగుల లోతు వరకూ బోరు వేస్తే నీరు సమృద్ధిగా లభ్యమయ్యేది. ప్రస్తుతం 800 అడుగుల నుంచి వెయ్యి అడుగులు వరకూ లోతుకు బోరు వేసినా నీటి జాడ కనిపించడం లేదు.
వైఎస్సార్‌సీపీ హయాంలో..
ఈ ప్రాంత రైతుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకునిసీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 193 చెరువులను హంద్రీ–నీవా జలాలతో నింపే పనులకు ఆమోదం తెలుపుతూ రూ.864 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఈ పనులను పూర్తి చేయడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.
అడుగంటిన భూగర్భజలాలు
నిట్టనిలువునా వాడిపోతున్న పంటలు

ఎండుతున్న చెరువులు