
జలుబు.. దగ్గు.. జ్వరం...
ధర్మవరం అర్బన్: నియోజకవర్గంలోని ధర్మవరం పట్టణం, రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభించాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అధికారికంగా 2,596 కేసులు రికార్డయ్యాయి. ఇంకా ప్రైవేటు ఆస్పత్రుల్లో వేల సంఖ్యలో విషజ్వరాలు, దగ్గు, జలుబు, న్యుమోనియా కేసులు ఉన్నట్లు సమాచారం. ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోజూ వందల సంఖ్యలో విషజ్వరాల బాధితులు వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు.
ఎక్కడ చూసినా చెత్తాచెదారమే...
ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా పారిశుధ్య చర్యలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు చెత్తాచెదారం తొలగించాల్సిన మున్సిపల్, పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. ముఖ్యంగా ధర్మవరం పట్టణంలోని ప్రధాన రహదారులపై చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పారిశుధ్యం పడకేయడంతో వైరల్ జ్వరాలు పెరిగిపోతున్నాయి.
పట్టించుకునేవారు లేరు
కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను పట్టించుకునేవారు కరువయ్యారు. ఏ వార్డులో చూసినా చెత్తాచెదారమే దర్శనమిస్తోంది. వార్డుల్లో పదిరోజులైనా చెత్తాచెదారం తొలగించడం లేదు. దోమలు విపరీతంగా పెరిగి విషజ్వరాలు వ్యాపింపజేస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు ప్రత్యేక చొరవ చూపి పారిశుధ్య చర్యలు చేప.. వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలి.
– మాసపల్లి సాయికుమార్,
కౌన్సిలర్, ధర్మవరం

జలుబు.. దగ్గు.. జ్వరం...