
రైతులు కష్టాల్లో ఉంటే విజయోత్సవాలా?
పెనుకొండ రూరల్: ‘‘రైతులు యూరియా కోసం రోడ్లపై తిరుగుతుంటే.. మీరు మాత్రం విజయోత్సవాలు చేసుకుంటారా..? రైతు గురించి ఏనాడైనా ఆలోచించారా..మీ వ్యవహార శైలి చూస్తుంటే రైతు సంక్షేమంపై మీకే మాత్రం చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది. మీ పాలన సూపర్ హిట్ కాదు...అట్టర్ ఫ్లాప్’’ అంటూ కూటమి నాయకులపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. సోమవారం ఆమె పెనుకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ‘అన్నదాత పోరు’ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులను వంచనకు గురిచేయడంలో కూటమి ప్రభుత్వం హిట్ కొట్టిందన్నారు. రాష్ట్రంలో బంగారం దొరుకుతోందని కానీ, యూరియా దొరకడం లేదనన్నారు. విత్తనాలు, ఎరువులు అన్నింటికీ రైతులు అడుక్కోవాల్సి వస్తోందన్నారు. ఈ పాలకులకు రైతుల కష్టాలు పట్టడం లేదన్నారు. రైతు సంతోషంగా ఉండాలంటే వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేశారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని సూచించారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ముంగిటకే విత్తనాలు, ఎరువులు తెచ్చారన్నారు. కూటమి అసమర్థ పాలనలో యూరియా కోసం పడరానిపాట్లు పడుతున్న రైతుల కోసం వైఎస్సార్ సీపీ మంగళవారం ‘అన్నదాత పోరు’కు శ్రీకారం చుట్టిందన్నారు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ రైతు పక్షమేనన్నారు. రైతుకోసం నిలబడ్డామని, వారికి ఏ కష్టం వచ్చినా పోరుకు సిద్ధమన్నారు.
యూరియా కూడా ఇవ్వలేని మీదీ ఓ ప్రభుత్వమా?
అది సూపర్ హిట్ కాదు ...అట్టర్‌ఫ్లాప్ సభ
రైతు కోసం మేం నిలబడ్డాం..పోరుబాట చేస్తున్నాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్