
యూరియా కూడా ఇవ్వలేరా?
కూటమి సర్కార్ రైతుకు ఎలాంటి మేలు చేయడం లేదు. విత్తనాలు కూడా సకాలంలో ఇవ్వలేకపోయింది. ఇప్పుడు నానా కష్టాలు పడి పంటలు పండిస్తుంటే యూరియా కూడా ఇవ్వలేకపోతోంది. ఇది చేతగాని ప్రభుత్వం. రైతుల కష్టాలు పట్టని ప్రభుత్వం. ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం యూరియా కావాల్సినంత ఉందంటూ ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా వారికి ధైర్యం ఉంటే మండల కేంద్రాలకు వచ్చి రైతులను కలిస్తే వాస్తవం తెలుస్తుంది. – అవుటాల రమణా రెడ్డి,
జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్