
నేడు ‘పరిష్కార వేదిక’
మడకశిర: గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. వినాయక చవితి సందర్భంగా మడకశిరలో కొలువుదీరిన గణనాథులను ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజించారు. శనివారం రాత్రి పది గంటలకు నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక వాహనాల్లో కొలువుదీర్చిన వినాయక విగ్రహాలతో శోభాయాత్ర ప్రారంభమై ఆదివారం తెల్లవారుజాము వరకు సాగింది. భారీ పోలీసు బందోబస్తు క్రేన్ల సాయంతో విగ్రహాలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. గణపతి బప్ప మోరియా.. బైబై గణేశా అంటూ భక్తులు వీడ్కోలు పలికారు. డీఎస్పీ నరసింగప్ప ఆధ్వర్యంలో సీఐలు రాజ్‌కుమార్, నగేష్ బందోబస్తును పర్యవేక్షించారు. నిమజ్జన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్ పర్యవేక్షించారు. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ఉత్సవ కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలకు సీఐ నగేష్ కృతజ్ఞతలు తెలిపారు.

నేడు ‘పరిష్కార వేదిక’

నేడు ‘పరిష్కార వేదిక’