
ఆలయాల మూత
కదిరి టౌన్/ లేపాక్షి: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధాన రాజగోపురం తలుపులు ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు అర్చకులు మూసివేశారు. సోమవారం ఉదయం 6 గంటలకు తలుపులు తెరుస్తారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, ఆలయ సంప్రోక్షణ, పరివార దేవత మూర్తులకు పుళికాపు, తిరుమంజనములు, నిత్య ప్రత్యాబ్దికములు గావించి, ఆరాధన, నివేదన అనంతరం భక్తులకు ఉదయం 8.30 గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తామని ప్రధాన అర్చకులు పార్థసారథి ఆచార్యులు తెలిపారు.
= లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయాన్ని ఆదివారం పూజాకార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు ఆలయ శుద్ధి, అభిషేకాకాల అనంతరం 8 గంటల నుంచి భక్తులకు స్వామి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు.

ఆలయాల మూత