
వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టర్ విజయశ్రీ
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల 17వ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ విజయశ్రీ శనివారం బాధ్యతలు తీసుకున్నారు. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో పెథాలజీ విభాగాధిపతిగా ఉన్న ఆమెను అనంతపురం వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర
కార్యదర్శుల నియామకం
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు(పార్లమెంటు)గా పలువురిని నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. జిల్లాకు చెందిన చౌళూరు మధుమతిరెడ్డికి మడకశిర, పెనుకొండ అసెంబ్లీ స్థానాలు, అనంతపురం జిల్లాకు చెందిన నిట్టూరు రఘునాథ్ రెడ్డికి కదిరి, పుట్టపర్తి అసెంబ్లీ స్థానాలు, నార్పల సత్యనారాయణ రెడ్డికి రాప్తాడు అసెంబ్లీ, కే.రమేష్‌రెడ్డికి ధర్మవరం అసెంబ్లీ, ఫయాజ్ బాషాకు హిందూపురం అసెంబ్లీ స్థానం కేటాయించింది.
● వీరు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ
పటిష్టతకు కృషి చేయనున్నారు.