
పాము కాటుతో యువకుడి మృతి
పరిగి: పాము కాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు... పరిగి మండలం కాలువపల్లికి చెందిన నాగేఽశ్వరరావు అలియాస్ కన్నప్ప కుమారుడు అనిల్‌కుమార్ (22) ఇంటి పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. బుధవారం రాత్రి తనకున్న ఇటుకల బట్టీ వద్ద ఉన్న గదిలో నిద్రించేందుకు మిత్రుడు శివయ్యతో కలిసి వెళ్లాడు. గురువారం వేకువజామున 3 గంటల సమయంలో అనిల్‌కుమార్‌కు ఏదో కుట్టినట్లయింది. గమనించి చీమ కుట్టి ఉంటుందని భావించి అలాగే పడుకున్నాడు. కాసేపటి తరువాత వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకోవడంతో గమనించిన శివయ్య వెంటనే తండ్రి కన్నప్పకు ఫోన్ సి, హుటాహుటిన హిందూపురంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎడమ చెవి వద్ద రెండు గాట్లను గమనించిన వైద్యులు పాము కాటుకు గురైనట్లు నిర్దారించారు. చికిత్సకు స్పందించక ఉదయం 6 గంటల సమయంలో మృతి చెందాడు. కన్నప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.