
కదిరిలో చెడ్డీగ్యాంగ్ హల్‌చల్
కదిరి టౌన్: పట్టణంలోని నారాయణరెడ్డి కాలనీలో మధ్యప్రదేశ్‌కు చెందిన చెడ్డీగ్యాంగ్ హల్‌చల్ చేసింది. కాలనీకి చెందిన బోడెల్ల నరసారెడ్డి ఇంటిలో 17 తులాలు బంగారు, 1500 గ్రాముల వెండి చోరీ చేసింది. పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపిన వివరాలు..నరసారెడ్డి కుటుంబం ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటోంది. ఇదే అదనుగా భావించిన మధ్యప్రదేశ్‌కు చెందిన చెడ్డీ గ్యాంగ్ ఆదివారం అర్ధరాత్రి ఇంటిలో చొరబడ్డారు. ఇంటిలో ఉన్న 30 గ్రాముల బంగారు నక్లెస్, 60 గ్రాముల 4 బంగారు గాజులు, 20 గ్రాముల బంగారు డాలర్, 40 గ్రాముల మూడు జతలు కమ్మలు, 20 గ్రాముల రెండు ఉంగరాలు, 1500 గ్రాముల వెండిని ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.9.5 లక్షలు ఉంటుంది. సోమవారం ఇంటి పక్కన ఉన్న నరసారెడ్డి బంధువులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇంటి వద్దనున్న సీసీకెమెరా పుటేజీ పరిశీలించగా ఐదుగురు సభ్యులున్న చెడ్డీగ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు తేలింది.
17 తులాల బంగారు,
1500 గ్రాముల వెండి చోరీ