
అవగాహన కల్పిస్తున్నాం
సాధారణ ప్రసవానికి.. సిజేరియన్‌కు మధ్య తేడాల గురించి, సిజేరియన్ వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. అలాంటి ఫిర్యాదులు వస్తే తప్పకుండా విచారణ చేపట్టి తగిన చర్యలకు సిఫారసు చేస్తాం. ప్రజారోగ్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేసే వైద్యులు నిర్ణీత సమయంలో ఆస్పత్రుల్లోనే ఉండాలి. ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసినా డ్యూటీ కాల్ వస్తే.. వెంటనే వెళ్లాలనే నిబంధన అమలు చేస్తున్నాం. – ఫైరోజాబేగం,
జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి