
రమణీయం.. రథోత్సవం
హిందూపురం: ‘హరేరామ... హరే కృష్ణ’ నామస్మరణతో హిందూపురం పురవీధులు మార్మోగాయి. హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం బహుద రథయాత్ర
హిందూపురంలో వైభవంగా సాగింది. తొలుత స్థానిక పాలిటెక్నికల్ కళాశాల కృష్ణాలాండ్ వద్ద గోవింద చరణ్ దాస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ బలరామ సుభద్రాదేవీ ఉత్సవమూర్తులకు పూజలు చేసి ప్రత్యేకంగా సిద్ధం చేసి 32 అడుగుల రథంలో కొలువుదీర్చారు. అనంతరం ఆశేష భక్త జనుల నడుమ ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర బైపాస్‌రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ సర్కిల్, వాసవీధర్మశాల ఫంక్షన్ హాలు మీదుగా వాల్మీకి భవన్‌కు చేరింది. రథయాత్రలో మహిళలు కోలాటం, చిన్నారులు భరతనాట్యం చేశారు. కృష్ణ సంకీర్తనలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. వాల్మీకి భవన్ వద్ద శ్రీకృష్ణ బలరామ సుభద్రాదేవి ఉత్సవ మూర్తులకు విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీసీ నాయకులు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, కొటిపి హనుమంతరెడ్డి పాల్గొన్నారు.
వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
పురంలో మార్మోగిన
శ్రీకృష్ణ నామస్మరణ

రమణీయం.. రథోత్సవం

రమణీయం.. రథోత్సవం