
మొహర్రం.. ఆధ్యాత్మిక సౌరభం
బత్తలపల్లి: మొహర్రం సందర్భంగా ఆధ్యాత్మిక సౌరభాలు వికసిస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం బత్తలపల్లిలోని ఖాసీంస్వామి పీర్లు భేటీకి రావాలని వివిధ గ్రామాల పీర్లకు ఆహ్వానం పలికేందుకు గ్రామాల పర్యటనకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మికత వెల్లివెరిసింది.
ఉదయం గ్రామోత్సవం..
బత్తలపల్లి, గంటాపురం, వేల్పుమడుగు, పోట్లమర్రి గ్రామాల్లో ఉదయం పీర్లకు గ్రామోత్సవం నిర్వహించారు. వందలాది మంది భక్తులు పీర్లు వెంట నడిచారు. తమ ఇళ్ల వద్దకు వచ్చిన పీర్లకు భక్తులు చక్కెర చదివించారు. అలావ్ తొక్కుతూ సందడి చేశారు. అనంతరం బత్తలపల్లి పీర్లు గంటాపురం, వేల్పుమడుగు, పోట్లమర్రికి వెళ్లగా.. ఆయా గ్రామాల పెద్దలు పీర్లతో ఎదురేగి స్వాగతం పలికారు. అనంతరం బత్తలపల్లి పీర్లు రాత్రికి మకాన్‌కు చేరుకున్నాయి. కాగా, మొహర్రం ఉత్సవాల్లో భాగంగా పీర్లస్వాముల వెంట వచ్చిన భక్తులకు, ప్రజలకు మాజీ సర్పంచు సింగారం నాగేష్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అదేవిధంగా బత్తలపల్లి ఎస్సీ కాలనీవాసుల ఆధ్వర్యంలోనూ అన్నదాన కార్యక్రమం జరిగింది.
భేటీకి వివిధ గ్రామాల పీర్లకు స్వాగతం పలికిన బత్తలపల్లి పీర్లు
ఆయా గ్రామాల్లో బత్తలపల్లి పీర్లకు ఘనస్వాగతం

మొహర్రం.. ఆధ్యాత్మిక సౌరభం

మొహర్రం.. ఆధ్యాత్మిక సౌరభం