లోక్‌ అదాలత్‌లో 10,089 కేసుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో 10,089 కేసుల పరిష్కారం

Jul 6 2025 6:30 AM | Updated on Jul 6 2025 6:30 AM

లోక్‌

లోక్‌ అదాలత్‌లో 10,089 కేసుల పరిష్కారం

అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లోనూ శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 10,089 కేసులు పరిష్కారమయ్యాయి. అనంతపురం జిల్లా కోర్టులో లోక్‌ అదాలత్‌ను ప్రధాన న్యాయమూర్తి భీమారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోక్‌ అదాలత్‌ తీర్పుపై అప్పీలుకు అవకాశం ఉండదన్నారు. రెగ్యులర్‌ కోర్టులో కేసులు పరిష్కారమైతే ఎవరో ఒకరే గెలిచే అవకాశం ఉంటుందని, అదే లోక్‌ అదాలత్‌లో అయితే ఇరు పార్టీలు సంతోషంగా ఇంటికి చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌. రాజశేఖర్‌, మొదటి అదనపు జిల్లా జడ్జి సత్యవాణి, బార్‌ అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ గురుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో మోటారు వాహనాల ప్రమాద కేసులు 28 పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.1,57,55,000 నష్ట పరిహారం ఇప్పించారు. సివిల్‌ కేసులు 75 పరిష్కారమయ్యాయి. వీటి విలువ రూ.5,35,59,388. ప్రీలిటిగేషన్‌ కేసులు 3,876 పరిష్కారం కాగా, ఇందులో మొత్తం రూ.1,98,98,382. ఎన్‌ఐ యాక్ట్‌ కేసులు– 22 మొత్తం రూ.31,50,000.

10న మెగా పీటీఎం సమావేశాలు

ప్రశాంతి నిలయం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 10న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్‌, టీచర్స్‌ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ తెలిపారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఎస్పీ వి.రత్నతో కలిసి విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి మెగా పీటీఎం సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థీ తల్లిందడ్రులతో కలసి పీటీఎంకి హాజరు కావాలని, ఉపాధ్యాయులందరూ విధిగా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరిస్తారన్నారు. అలాగే ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈఏడాది ప్రభుత్వ స్కూళ్లలో 1వ తరగతిలో 20,789 మంది, 6వ తరగతిలో 24 వేల మంది చేరారన్నారు. డ్రాప్‌ అవుట్స్‌ నివారించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. సామాజిక భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడమే పీ–4 కార్యక్రమం లక్ష్యమన్నారు. తల్లికి వందనంకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 14,703 ఫిర్యాదులు అందాయని, అందులో 10,803 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. మిగిలిన ఫిర్యాదులను మరోసారి పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

లోక్‌ అదాలత్‌లో  10,089 కేసుల పరిష్కారం1
1/1

లోక్‌ అదాలత్‌లో 10,089 కేసుల పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement