
ఎస్కేయూ వీసీ నియామకంపై సెర్చ్ కమిటీ ఏర్పాటు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వీసీ నియామకంపై సెర్చ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. ముగ్గురు సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ నామినీగా డాక్టర్ రామ్‌కుమార్ కాకాని (డైరెక్టర్, ఐఐఎం రాయ్‌పూర్), పాలకమండలి నామినీగా ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ (వీసీ, గీతం వర్సిటీ), యూజీసీ నామినీగా ప్రొఫెసర్ అలోక్‌కుమార్ రాయ్ (వీసీ, యూనివర్సిటీ ఆఫ్ లక్నో బాబుగంజ్, లక్నో) వ్యవహరించనున్నారు. ఈ కమిటీలోని సభ్యులు సమావేశమై ముగ్గురిని ఎంపిక చేయనున్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు గవర్నర్ తుది నియామకం చేయనున్నారు. కాగా, ఎస్కేయూ ఇన్‌చార్జి వీసీగా ప్రొఫెసర్ బి.అనిత ప్రస్తుతం ఉన్నారు. ఇన్‌చార్జి పాలనలోనే ఏడాది పూర్తయింది. సాధారణ ఉద్యోగిని రిజిస్ట్రార్‌గా నియామకం చేశారు. కనీసం డిప్యూటీ రిజిస్ట్రార్ స్థాయి అధికారిని నియామకం చేయాల్సి ఉండగా, నిబంధనలు బేఖాతరు చేస్తూ రీసెర్చ్‌కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌ను రిజిస్ట్రార్‌గా నియామకం చేశారు. ఏడాది కాలంలో వర్సిటీకి ఒక్క యూజీసీ ప్రాజెక్ట్ రాలేదు. కీలక నిర్ణయాలు అన్నీ జాప్యం కావడంతో వర్సిటీ పురోగతి మందగించింది. ఇలాంటి తరుణంలో పూర్తి స్థాయి వీసీ వస్తే వర్సిటీ పురోగతి గాడిన పడుతుందని ఉద్యోగులు, విద్యార్థులు భావిస్తున్నారు.
సగం ధరకే వాహనమంటూ కుచ్చుటోపీ
● తాడిపత్రి పోలీసుల అదుపులో మోసగాళ్లు?
● ఇప్పటి వరకూ 53 ద్విచక్ర వాహనాల స్వాధీనం
తాడిపత్రి టౌన్: సగం ధరకే అంటూ ప్రజలను మోసం చేసి ద్విచక్ర వాహనాలను అంటగడుతున్న తాడిపత్రికి చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణలో తాడిపత్రిలోనే వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీలు, ఆటోలు విక్రయించినట్లు గుర్తించి, ఇప్పటి వరకూ 53 ద్విచక్ర వాహనాలతో పాటు ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వాహనాల కోసం పోలీసులు వల పన్నారు. కాగా, తాడిపత్రి పట్టణంలోని పెద్దబజార్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రధాన నిందితుడుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతనితో పాటు మరో ఇద్దరిని దుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే పూర్తిగా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకునేంత వరకూ వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్ ఆవరణలో పెద్ద ఎత్తున ద్విచక్రవాహనాలు ప్రత్యక్షం కావడంతో పట్టణ వాసుల అవాక్కయ్యారు. కాగా, సగం ధరకే ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసిన వారిలో ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్‌స్టేషన్ చుట్టూ ఉన్న వ్యాపార సముదాయాల యజమానులు, పోలీసులూ ఉన్నట్లు సమాచారం. తాడిపత్రికి చెందిన కొందరు ధనవంతులు సైతం కార్లు, లారీలు కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ఎస్కేయూ వీసీ నియామకంపై సెర్చ్ కమిటీ ఏర్పాటు

ఎస్కేయూ వీసీ నియామకంపై సెర్చ్ కమిటీ ఏర్పాటు

ఎస్కేయూ వీసీ నియామకంపై సెర్చ్ కమిటీ ఏర్పాటు