
103 మంది విద్యార్థులకు ఏకోపాధ్యాయురాలా?
డి హీరేహాళ్(రాయదుర్గం): ఏకోపాధ్యాయురాలితో తమ పిల్లల చదువులు ఎలా సాగుతాయంటూ కర్ణాటక సరిహద్దున ఉన్న డి.హీరేహాళ్ మండలం మలపనగుడి గ్రామస్తులు బుధవారం పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. 103 మంది విద్యార్థులుంటే ఒక్క ఉపాధ్యాయురాలు ఎలా నెట్టుకొస్తోందో చెప్పాలంటూ నిలదీశారు. నిత్యం హాజరు వేయడం, అల్లరి చేయకుండా కంట్రోల్ చేయడం మినహా పుస్తకాలు తెరవలేక పోతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఎంఈఓకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రైవేటు బడుల్లో ఖరీదైన చదువులకు పంపడం తమ వల్లకాదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి మరో ఇద్దరు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు.
పాఠశాలకు తాళం వేసి
నిరసన తెలిపిన గ్రామస్తులు