రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీల్లో జిల్లా వాసుల ప్రతిభ
అనంతపురం అర్బన్: ఈనెల 16, 17 తేదీల్లో విజయవాడ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లావాసులు వివిధ విభాగాల్లో ప్రతిభ చూపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ వి.వినోద్‌కుమార్ అభినందనలు తెలిపారు. వ్యాసరచన పోటీల్లో నగరానికి చెందిన బి.భావన రసజ్ఞ ప్రథమ బహుమతి సాధించారు. సోలో యోగా పోటీల్లో (35 ఏళ్లు ఆపై) నగరానికి చెందిన ఎం.చలపతి రెండో బహుమతి గెలుచుకున్నారు. షార్ట్ ఫిలిమ్ పోట్లీలో (35 ఏళ్లు ఆపై) గుత్తికి చెందిన సి.విజయభాస్కర్ చౌదరి ద్వితీయ బహుమతి సాధించారు. పోస్టర్ పోట్లీలో (35ఏళ్లు ఆపై) ఉరవకొండకు చెందిన కె.సునీత మూడో బహుమతి దక్కించుకున్నారు. యోగా షార్ట్ ఫిలిమ్ పోటీల్లో (10–18 ఏళ్ల మధ్య) ఉరవకొండకు చెందిని కె.భరణి రెండో బహుమతి, యోగా క్విజ్ పోటీల్లో (19–35 ఏళ్లు) నగరానికి చెందిన బి.భావన రసజ్ఞ, బి.సాయి చంద్రశేఖర్ (ఉరవకొండ), కె.రుషిత తన్మయి తృతీయ బహుమతి గెలుపొందారు.


