ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ బిజీ అయిపోయారు. ఇంట్లో వండుకునే సమయం లేక కొందరు, ఓపిక లేక మరికొందరు.. ఆహార పదార్థాలను బయట కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. ఇదే కొందరు వ్యాపారులకు వరంగా మారింది. శాసీ్త్రయ వంట విధానాలకు స్వస్తి పలికి కొత్తదనం పేరుతో అశాసీ్త్రయ | - | Sakshi
Sakshi News home page

ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ బిజీ అయిపోయారు. ఇంట్లో వండుకునే సమయం లేక కొందరు, ఓపిక లేక మరికొందరు.. ఆహార పదార్థాలను బయట కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. ఇదే కొందరు వ్యాపారులకు వరంగా మారింది. శాసీ్త్రయ వంట విధానాలకు స్వస్తి పలికి కొత్తదనం పేరుతో అశాసీ్త్రయ

Dec 20 2025 9:20 AM | Updated on Dec 20 2025 9:20 AM

ఉరుకు

ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ బిజీ అయిపోయారు. ఇంట్లో వండ

చిలమత్తూరు: కర్ణాటక రాజధాని బెంగళూరుకు అత్యంత సమీపంలో ఉండడంతో హిందూపురంలోనూ అక్కడి కల్చర్‌ విస్తరించింది. ఈ క్రమంలో స్థానికంగా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లకు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం దుకాణాలు, బెల్టుషాపులూ తోడు కావడంతో ప్రస్తుతం హిందూపురంలో ఎటు చూసినా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తదనం చూపి ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు నిర్వాహకులు పోటీ పడ్డారు. ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది. అశాప్త్రీయ పద్ధతుల్లో వండే ఆహారా పదార్థాలను భుజించి పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు.

ఫ్లేమ్‌ త్రోయర్‌తో చికెన్‌ వంటకం..

హిందూపురంలోని చౌడేశ్వరీ కాలనీలో ప్రభుత్వ కార్యాలయాలు, మద్యం దుకాణాలు, ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం ఉండడంతో నిత్యం జనం రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బడిముబ్బడిగా ఫాస్ట్‌ పుడ్‌ సెంటర్లు వెలిసాయి. అత్యధికులు మాంసాహారం వైపు మొగ్గుచూపుతుండడంతో వారికి వేడివేడిగా చికెన్‌ వంటకాలను అందించేందుకు నిర్వాహకులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో చికెన్‌ను వండే శాసీ్త్రయ విధానాలకు స్వస్తి పలికి అతి త్వరగా.. క్షణాల వ్యవధిలోనే వంటకం పూర్తయ్యేలా ఫ్లేమ్‌ త్రోయర్‌లను వినియోగిస్తున్నారు. సాధారణంగా వంట చేసే సమయంలో పాత్రకు దిగువన మంట పెడుతుంటారు. ఫ్లేమ్‌ త్రోయర్‌ (గ్యాస్‌ టార్చ్‌)తో చికెన్‌పై నేరుగా అత్యధిక వేడిని కలిగిన మంటను విరజిమ్మడం ద్వారా ఉడికీఉడకని వంటకాన్ని వేడివేడిగా అందజేస్తుంటారు. ఇలా చేసిన వంటకాల్లో ఫైబర్‌ శాతం తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీంతో జీర్ణ వ్యవస్థ నెమ్మదించి హానికర సమ్మేళనాలు కడుపులోనే ఉండిపోవడం ద్వారా గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌కి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. గ్యాస్‌ టార్చ్‌ ద్వారా మాంసం కాల్చినప్పుడు హెటిరోసైక్లిక్‌ అమైన్స్‌, పాలీసైక్లిక్‌ ఆరోమేటిక్‌ హైడ్రోకార్బన్స్‌ హానికర రసాయనాలు వెలువడే ప్రమాదం కూడా ఉందంటున్నారు. వేడికి గ్యాస్‌ టార్చ్‌ లోహపు రసాయన కణాలు విడిపోయి నేరుగా ఆహారంపై పడే ప్రమాదం ఉంటుందంటున్నారు. ఇది తిన్న వారు తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదముంటుందని హెచ్చరిస్తున్నారు.

చర్యలు చేపడతాం

ఫుడ్‌ గ్రేడ్‌ కాని గ్యాస్‌ టార్చ్‌లను ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాల్లో వాడుతున్నారు. ఇక మాంసహార విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాలి. రుచి కోసమని అశాసీ్త్రయ విధానాలతో వండిన ఆహార పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదం. అలాంటి ఆహారం విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటాం.

– గణేష్‌, ఫుడ్‌సేఫ్టీ అధికారి , హిందూపురం

ఫ్లేమ్‌ త్రోయర్‌తో వండుతున్న

చికెన్‌ పదార్థాలు

కొత్త రుచి కోసం జనం పాకులాట

ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ బిజీ అయిపోయారు. ఇంట్లో వండ1
1/2

ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ బిజీ అయిపోయారు. ఇంట్లో వండ

ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ బిజీ అయిపోయారు. ఇంట్లో వండ2
2/2

ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ బిజీ అయిపోయారు. ఇంట్లో వండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement